#KalvakuntlaKavitha #TelanganaJagruthi #JanamBaata #Karimnagar #TelanganaPolitics #SilverFiligree #ArtistsSupport #FarmersIssues #WomenEmpowerment #PrajaMantalu - Praja Mantalu

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత
జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం

కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు):

“జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు.

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కరీంనగర్‌లో నిర్వహించిన “జాగృతి జనం బాట” కార్యక్రమంలో ప్రజలతో, కళాకారులతో, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో స్పష్టమైన రాజకీయ శూన్యత ఉందని, ప్రజల తరఫున పోరాడాల్సిన ప్రధాన పార్టీలు ఆ బాధ్యతను నిర్వర్తించడం లేదని తీవ్రంగా విమర్శించారు.

“నేను వాళ్ల, వీళ్ల బాణం కాదు... తెలంగాణ ప్రజల బాణం” అని అన్నారు.
- “ప్రజలు కొన్ని పార్టీలను నమ్మి దగాపడ్డారు. మేము ప్రజల గొంతుకగా మారతాం.”
- “మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు స్పందించలేదు.”
- “ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోతే చదువుకునే ఆడపిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది.”

- “వెల్ఫేర్ హాస్టల్స్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గత ఏడాదిన్నరలో 110 మంది విద్యార్థులు మరణించారు.”
- “కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారలేదు. వెయ్యి కోట్లు కేటాయించినా పురోగతి లేదు.”
- “గ్రానైట్ మాఫియా దుర్వినియోగం చేస్తోంది. ఇకపై మౌనం కాదు — ఉద్యమం చేస్తాం.” అని కవిత అన్నారు.

🔹 కళాకారులతో సమావేశాలు:

జాగృతి ఆధ్వర్యంలో జానపద, సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులతో కవిత ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆమె మాట్లాడుతూ,«“జాగృతి నుంచి అనేక మంది కళాకారులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం.కళాకారుల వివరాలను మురళీధరరావు దేశ్పాండె, గోపాల్ రావుల సహకారంతో సేకరిస్తున్నాం. వారిని ప్రభుత్వం గుర్తించి వేతనాలు, సాయం అందించేలా కృషి చేస్తాం,” అని హామీ ఇచ్చారు.»

సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ 2,000 ఏళ్ల వారసత్వ కళ పరిస్థితిని వివరించారు. “నెహ్రూ గారు ఉపయోగించిన బటన్, జి-20లో అశోక చక్రం కూడా కరీంనగర్ నుంచే తయారైంది” అని వారు తెలిపారు. దళారులు మోసం చేస్తున్నారని, ప్రభుత్వ సహాయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. కవిత గారు వారిని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.

ప్రజా సమస్యలపై కవిత మొంథా తుఫాన్ వల్ల రైతులు నష్టపోయారని, వారికి ఎకరాకు రూ.50,000 పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే రోడ్లు, వంతెనలు, మత్తడి ప్రాజెక్ట్ వంటి పలు స్థానిక సమస్యలపై అధికారులు, మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తామని ప్రకటించారు.