#DelhiCrime #Diwali2025 #ViralVideo #GunFiring #PoliceArrest #ShastriNagar #ArmsAct #IndiaNews - Praja Mantalu

తండ్రి పిస్టల్ తో కాల్పులు : ఇంస్టా లొ పోస్ట్ : యువకుని అరెస్ట్
దిల్లీ నవంబర్ 01:

దీపావళి సందర్భంగా తుపాకీ కాల్పులు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిని, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర దిల్లీ శాస్త్రి నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, 22 ఏళ్ల సుమిత్ అనే యువకుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి రీల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమిత్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం, ఆయుధం లైసెన్స్ గడువు అక్టోబర్ 1న ముగిసిందని తేలడంతో తండ్రి ముకేశ్ కుమార్ (42)నూ అదుపులోకి తీసుకున్నారు.

శాస్త్రి నగర్ మెట్రో స్టేషన్ వద్ద గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు ఈ వీడియోపై సమాచారం పొందారు. అనంతరం శాస్త్రి నగర్‌లోని దుకాణం వద్ద దాడి చేసి సుమిత్‌ను పట్టుకున్నారు. విచారణలో సుమిత్ తన తండ్రి స్వీట్ షాప్, క్యాటరింగ్ వ్యాపారంలో సహాయం చేస్తాడని తెలిపాడు. “ప్రముఖుడవ్వాలని భావించి దీపావళి రోజున తుపాకీతో వీడియో తీశాడు” అని ఉత్తర జిల్లా డీసీపీ రాజా బంథియా వెల్లడించారు.

తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్‌లు 25, 27, 30, 54, 59 మరియు భారతీయ న్యాయ సన్హిత 125వ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.