#Jagtial #Sarangapur #JeevanReddy #FarmersLoss #RainDamage #TelanganaNews #PrajaMantalu #Agriculture #PaddyProcurement #CornCollection #TRS #RevanthReddy - Praja Mantalu

జగిత్యాల జిల్లాలో పంట నష్టం అంచనపై అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం
పత్రికా సమావేశంలో కీలక వ్యాఖ్యలు:

రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేమి.
- ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
- తడిసిన, మొలకెత్తిన ధాన్యానికి సడలింపులతో కొనుగోలు అవసరం.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాలి.

జగిత్యాల (రూరల్) నవంబర్ 01 (ప్రజా మంటలు):

సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి, పోతారం గ్రామాలలో అకాల వర్షాలతో నేలకొరిగిన పంట పొలాలను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు పరిశీలించారు. పంట పొలాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా పరిశీలించిన ఆయన అధికారులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఆవేదనతో కూడిన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫీల్డ్ స్థాయిలో అధికారులు ఇప్పటికీ స్పందించకపోవడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోందని ఆయన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ)లకు ఫోన్‌లో తెలిపారు. కలెక్టర్ స్థాయిలో పరిశీలన జరిగినప్పటికీ గ్రామ స్థాయిలో అధికార యంత్రాంగం కదలికలోలేదని వ్యాఖ్యానించారు.

రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే రైతుల ఇబ్బందులకు కారణమని జీవన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించిన “తడిసిన ధాన్యం, మొలకెత్తిన పంటల” కొనుగోలు నిర్ణయం రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించిందని తెలిపారు. కానీ, అధికారులు ఆ దిశగా చలనం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సారంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“రైతు ఎంతో కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో నేలకొరిగిపోవడం బాధాకరం. బట్టపల్లిలో దాదాపు 200 ఎకరాల్లో పంట నాశనం అయింది. హార్వెస్టర్లు నడవలేని పరిస్థితి నెలకొంది. కనీసం ఒక ఎకరానికి రూ.5,000 అదనపు ఖర్చు వస్తోంది” అని వివరించారు.

సగం పంట నేలకొరిగి, సగం మొలకెత్తిపోయిందని, ధాన్యం రంగు మారిందని తెలిపారు.ప్రభుత్వం ప్రకటించిన ఎకరానికి రూ.10,000 ఆర్థిక సాయం తక్షణమే రైతులకు అందాలని డిమాండ్ చేశారు.

ధాన్యం సేకరణ కేంద్రాలు వేగంగా ప్రారంభించకపోతే తడిసిన పంట పూర్తిగా నష్టమవుతుందని హెచ్చరించారు. “రైతుకు ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకం కలిగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది,” అని అన్నారు.

మొక్కజొన్న సేకరణపై మాట్లాడుతూ —“మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న సేకరణ ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయం. కానీ 18 క్వింటాళ్ల పరిమితిని సడలించాలి. పాస్‌బుక్ ఆధారంగా కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా న్యాఫెడ్ ద్వారా మద్దతు ధరతో సేకరణకు ముందుకు రావాలి,” అని జీవన్ రెడ్డి కోరారు.

జీవన్ రెడ్డి చివరిగా,“రైతులకు నష్టం జరగకుండా, ధాన్యం సేకరణ తక్షణమే ప్రారంభించి, సాయాన్ని అందించాలి. రైతుల ఆత్మస్థైర్యం కాపాడటం ప్రభుత్వ యంత్రాంగపు కర్తవ్యమని గుర్తు పెట్టుకోవాలి,” అని పిలుపునిచ్చారు.