help needed - Praja Mantalu

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ఆర్థిక సాయం చేయండి
జగిత్యాల, సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన జగిత్యాలలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి తరలించారు.

నాగరాజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం చురుకుగా పనిచేశారు. జర్నలిస్టుల బస్‌పాస్ రెన్యూవల్, రైల్వే పాస్‌ల రెన్యూవల్ వంటి పనులను స్వయంగా తీసుకెళ్లి పూర్తి చేయించి, వాటిని జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి అందించేవారని సహచరులు గుర్తుచేస్తున్నారు. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మూడు సార్లు ఎన్నికయ్యారు.

ప్రస్తుతం నాగరాజు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జగిత్యాల ప్రెస్ క్లబ్ తరఫున కొంత ఆర్థిక సహాయం అందించినప్పటికీ, వైద్య ఖర్చులకు అది సరిపోవడం లేదు. భార్య, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న కుటుంబం రోజువారీగా వేల రూపాయల వైద్య ఖర్చులను భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలో జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి చెందిన జర్నలిస్టు మిత్రులు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి, తోటి జర్నలిస్ట్ గాజుల నాగరాజు కుటుంబానికి అండగా నిలవాలని జర్నలిస్టు వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.