icds - Praja Mantalu

చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఆట ఆధారిత విద్య : డి డబ్ల్యు ఓ భాస్కర్
జగిత్యాల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):

మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం వంటి ఆట ఆధారిత అభ్యాసం ఎంతో దోహదపడుతుందని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ అన్నారు. పోషణ మాసంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చిన్నారుల్లో శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ, భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భాస్కర్ తెలిపారు. పిల్లలకు చిన్న వయస్సు నుంచే పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలో చేరే ముందే విద్యకు సిద్ధం చేయాలని సూచించారు.

పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, సమాజం సమష్టిగా భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. చిన్నారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి వారి ప్రతిభను వెలికితీయాలని సూచించారు.

సర్పంచ్ కవిత మాట్లాడుతూ పోషకాహారం ఆరోగ్యకరమైన కుటుంబానికి పునాది అని అన్నారు. “ఆరోగ్యవంతమైన తల్లి.. ఆరోగ్యవంతమైన బిడ్డ.. ఆరోగ్యవంతమైన సమాజం” అనే లక్ష్యంతో ప్రతి కుటుంబం పిల్లల పోషణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

కార్యక్రమంలో సీడీపీఓ జయప్రద, ఏసీడీపీఓ రాజశ్రీ, పర్యవేక్షకులు పవిత్ర, లావణ్య, ఆరోగ్య వైద్య అధికారి శ్రీదేవి, సౌమ్య, అంగన్‌వాడీ టీచర్లు జయప్రద, పద్మజ, జలజ, రాజమణి, స్వప్న, జమున, సరిత, గీత, మమత, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.