bye elections - Praja Mantalu

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లి పోటీ చేస్తాం - కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
హైదరాబాద్ సెప్టెంబర్‌ 26 (ప్రజా మంటలు) :

ఖైరతాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడంపై చట్టపరమైన, రాజ్యాంగపరమైన చర్చ అవసరమని అన్నారు

ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాల ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యం–విద్య రంగాల్లో సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

2020–21లో 6 వేల మంది, 2022–23లో 4,933 మంది, 2024–25లో 3,853 మంది పసిపిల్లలు మరణించారని పేర్కొంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో అధిక బెడ్ ఆక్యుపెన్సీ, నిమ్స్‌లో బెడ్లు, సర్జరీల కోసం దీర్ఘకాలిక నిరీక్షణ వంటి సమస్యలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల మధ్య వ్యత్యాసం ఉందని కవిత ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు, పలు ఆరోగ్య పథకాలకు తగిన నిధులు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించాలని కోరారు.

“పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలి. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టేలా ప్రజలతో కలిసి పోరాడతాం” అని కవిత అన్నారు. ఇకపై ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, బాలికల పారిశుధ్య సౌకర్యాల కొరతపై కూడా దృష్టి సారించాలని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

తన ఆస్తులపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల కంటే రూపాయి ఎక్కువ ఉన్నట్లు నిరూపించినా ఆ ఆస్తిని వదులుకుంటానని కవిత అన్నారు. తన ఫామ్‌హౌస్‌లో కబ్జా భూమి లేదని పేర్కొన్నారు..

ఎస్ఐఆర్ ప్రక్రియలో చిన్న క్లరికల్ తప్పిదాల కారణంగా ఓట్లు తొలగించే అవకాశం ఉందని, దీనిపై స్పష్టత అవసరమని కవిత పేర్కొన్నారు. అలాగే సాగునీరు, తాగునీరు, నెరేళ్ల బాధితుల సమస్యలపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.