చింతకుంట - Praja Mantalu

చింతకుంట చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశిలించిన ఎమ్నెల్యె సంజయ్
జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 700కు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారని అభినందించారు.

జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పట్టణంలోని ప్రతి వార్డుకు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు నిధులు కేటాయించి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ చింతకుంట చెరువు వద్ద నిమజ్జనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, రాబోయే రోజుల్లో పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.