Praja Vani - Praja Mantalu

సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్‌-1 అధికారులు
బీహార్‌లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం

ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (ప్రజా మంటలు):
తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్‌ రాష్ట్రానికి చెందిన గ్రూప్‌-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని పర్యవేక్షించడం వంటి విధానాలను బీహార్‌లోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్‌ చైర్‌పర్సన్‌, రాష్ట్ర స్థాయి సీఎం ప్రజావాణి ఇన్‌చార్జ్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో 120 మంది సభ్యులతో కూడిన బీహార్‌ గ్రూప్‌-1 అధికారుల బృందం శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో భేటీ అయింది. అనంతరం అధికారులు సీఎం ప్రజావాణి కార్యక్రమం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరించే విధానం, వాటిని సంబంధిత శాఖలకు బదిలీ చేయడం, సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షించే ప్రక్రియపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే సమన్వయం చేయడం వంటి అంశాలను వారు పరిశీలించారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి

ఈ సందర్భంగా గద్వాల్‌ విజయలక్ష్మి ప్రజల నుంచి ప్రజావాణి వినతులను స్వయంగా స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి అర్హమైన సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, డివిజన్‌, మండల స్థాయిలకు విస్తరించారని విజయలక్ష్మి తెలిపారు. వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు.

సీఎం ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారంలో 74 శాతం సక్సెస్‌ రేట్‌ సాధించామని ఆమె పేర్కొన్నారు. “ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ప్రజావాణికి వస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మా ప్రధాన బాధ్యత” అని అన్నారు.

బీహార్‌లోనూ మార్పులకు ప్రయత్నం

తెలంగాణ సీఎం ప్రజావాణి విధానం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని బీహార్‌ గ్రూప్‌-1 అధికారులు తెలిపారు. ప్రస్తుతం బీహార్‌లో అమలవుతున్న ‘ప్రజా దర్బార్‌’ వ్యవస్థలోనూ ఇలాంటి సమర్థవంతమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పరిశీలించిన విధానాలను బీహార్‌లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

కార్యక్రమంలో సీఎం ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ అధికారి కె. విద్యాసాగర్‌, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ అధికారి ఉషారాణి, డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్‌ తదితరులు పాల్గొన్నారు.