mini stadium - Praja Mantalu

నూకపల్లి సరస్వతీ ఆలయం వద్ద జగిత్యాల డైలీ వాకర్స్ సందడి
కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు.. ఆటపాటలతో ఉత్సాహం

జగిత్యాల, సెప్టెంబర్ 06, ప్రజా మంటలు:
జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్వామి మినీ స్టేడియం డైలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మల్యాల మండలం నూకపల్లిలోని శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయ సన్నిధిలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది వాకర్స్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో సందడిగా గడిపారు.

నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉండే వారికి వాకింగ్, యోగా, వ్యాయామం ఎంతో ఉపయోగకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రతిరోజూ శారీరక వ్యాయామానికి కొంత సమయం కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, వాకింగ్ సమయంలో పాటించాల్సిన మెలకువలు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై సభ్యులకు పలు సూచనలు చేశారు.

అనంతరం నిర్వహించిన ఆటలు, పాటల కార్యక్రమాల్లో వాకర్స్, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకన్న, కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ వాకర్స్, వ్యాపారవేత్తలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు, సభ్యుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.