భట్టి - Praja Mantalu

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు):

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్‌ చైర్మన్‌ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ కార్యకలాపాలతో పాటు పేద, మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూడాలని బసవరాజు శ్రీనివాస్‌ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క.. పెండింగ్‌లో ఉన్న రూ.6 కోట్ల నిధులతో పాటు ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ పొందిన రూ.25 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం బ్రాహ్మణ సంక్షేమం పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమని బసవరాజు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ నిధులతో పేద, మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.

“బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన నిధులను విడుదల చేయడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది తెలంగాణ బ్రాహ్మణ సమాజంపై ప్రభుత్వం చూపుతున్న గౌరవం, చిత్తశుద్ధికి నిదర్శనం” అని బసవరాజు శ్రీనివాస్‌ అన్నారు.

ఈ సందర్భంగా యావత్‌ తెలంగాణ బ్రాహ్మణ సమాజం తరఫున ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయాలు, ప్రాంతాలు, శాఖల భేదాలకు అతీతంగా బ్రాహ్మణ సమాజం ఐక్యంగా ఉండి ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగితే మరిన్ని అభివృద్ధి అవకాశాలను సాధించుకోవచ్చని బసవరాజు శ్రీనివాస్‌ అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం, ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.