dependent - Praja Mantalu

2 వేల మంది అన్‌ఫిట్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలి: కవిత
హైదరాబాద్, ఆగస్టు 19 (ప్రజా మంటలు):

సింగరేణిలో అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 2 వేల మంది కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు.

హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్థన్‌తో కలిసి విడుదల చేసిన వీడియో సందేశంలో కవిత ఈ డిమాండ్లు చేశారు. గత నెలలో కార్మిక సంఘాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిందని, అయితే దానిని ఒక్క నెలకే పరిమితం చేయడం సరికాదన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు బోర్డును కొనసాగించాలని స్పష్టం చేశారు.

డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు అన్యాయం జరిగితే సహించేది లేదని కవిత హెచ్చరించారు.

అలియాస్ పేర్ల సమస్య పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు లభించడంలో అడ్డంకిగా మారిన అలియాస్ పేర్ల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కవిత కోరారు. ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న యువకులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా దీక్ష విరమింపజేయడం సరికాదన్నారు.

ఈ సమస్యపై కూనంనేని సాంబశివరావు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కవిత విమర్శించారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన కార్మికుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న యువకులకు హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేపడుతున్న ఆందోళనలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కవిత ప్రకటించారు. ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీని అమలు చేయడంతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ప్రమోషన్లు, బదిలీలు తదితర సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కవిత సూచించారు.