cjp - Praja Mantalu

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన
హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు):

దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

NEET ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం: కందుల మధు

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కందుల మధు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన కేసులు పెట్టడం దారుణమన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రధాని మోడీ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులకు న్యాయం చేయకపోతే పోరాటం: బొడ్డుపల్లి లింగం

దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బొడ్డుపల్లి లింగం అన్నారు. 2024లో NTA, UGC నిర్వహించిన పలు పరీక్షలపై కూడా వివాదాలు తలెత్తాయని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కేంద్రం బాధ్యత విస్మరించింది: అశోక్ యాదవ్

పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని అశోక్ యాదవ్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. జరిగిన పరిణామాలపై ప్రధాని మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ర్యాలీలో గుమ్మడి క్రాంతి, సీహెచ్ భగత్ యాదవ్, కొప్పుల అర్జున్, రాజ్ కుమార్, కశ్యప్ యాదవ్, సాయి నేత, అకిల్ రెడ్డి, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు):

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ మేరకు బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు.
విద్యార్థులు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తే సీసీ కెమెరాలు ఆపేసి, ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసి, లాఠీలతో దాడి చేయడం ఏమిటని కవిత ప్రశ్నించారు. బ్రిటీష్ పాలనలో ప్రజలు ప్రశ్నించినప్పుడు ఎలా అణచివేతకు గురయ్యారో, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
“గతంలో రైతులపై.. ఇప్పుడు విద్యార్థులపై దాడులు చేస్తున్నారు. విద్యార్థులపై విరిగిన ప్రతి లాఠీకి, చిందిన ప్రతి రక్తపు చుక్కకు దేశ ప్రజలు ఓటు రూపంలో సమాధానం చెబుతారు” అని కవిత హెచ్చరించారు. విద్యార్థులపై జరిగిన దాడికి కేంద్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నీట్ పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. పేపర్ లీకేజీలకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా ఐక్యంగా ఉండాలని, వ్యవస్థలో మార్పు కోసం రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు.
గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు న్యాయం చేయాలి
స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్లు రోజంతా శ్రమిస్తున్నా కుటుంబ పోషణకు సరిపడ ఆదాయం పొందడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగేటర్ సంస్థలతో ప్రభుత్వం చర్చించి గిగ్ వర్కర్లు, డ్రైవర్ల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని కల్వకుంట్ల కవిత తెలిపారు.