second in south India - Praja Mantalu

దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో గాయత్రి బ్యాంక్
ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా: సీఈఓ వనమాల శ్రీనివాస్
జగిత్యాల, జూలై 19 (ప్రజా మంటలు):

రూ.4,558.89 కోట్ల వ్యాపారంతో, 86 శాఖల నెట్‌వర్క్‌తో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ దక్షిణ భారతదేశంలో రెండో స్థానానికి చేరుకుందని బ్యాంకు అధ్యక్షుడు గుండేటి గంగాధర్ తెలిపారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన బ్యాంకు వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

26 సంవత్సరాల క్రితం ప్రారంభమైన బ్యాంకు ప్రస్తుతం 9,36,346 మంది ఖాతాదారులతో మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా ఎదిగిందన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరించిన ఖాతాదారులు, సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో డైరెక్ట్ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలను ప్రారంభించామని, 202 బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా సేవలను వినియోగదారుల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు.

2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.27.21 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, స్టాట్యూటరీ ఆడిటర్లచే ‘ఏ’ క్లాస్ బ్యాంకుగా వర్గీకరించబడిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి రూ.6,204.06 కోట్ల వ్యాపార లక్ష్యంతో పాటు 1.5 లక్షల కొత్త ఖాతాదారులను చేర్చుకునే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇటీవల 24 కొత్త శాఖలను ప్రారంభించడంతో మొత్తం శాఖల సంఖ్య 86కు చేరిందన్నారు. త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్, సాంకేతిక ఆధారిత మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అనంతరం బ్యాంకు సీఈఓ వనమాల శ్రీనివాస్ 2026 మార్చి 31 నాటికి ఆడిటెడ్ జమ–ఖర్చులు, ఆస్తులు–అప్పులు, లాభ–నష్టాల నివేదికలను సమర్పించారు. గత ఏడాదితో పోలిస్తే డిపాజిట్లలో 31.63 శాతం వృద్ధి సాధించి రూ.2,356.68 కోట్లకు చేరుకున్నామని, రుణాల్లో 38.10 శాతం వృద్ధితో రూ.1,868.92 కోట్ల రుణ నిల్వలు ఉన్నాయని తెలిపారు. రూ.574 కోట్ల పెట్టుబడులు, రూ.27.21 కోట్ల నికర లాభంతో బ్యాంకు బలమైన ఆర్థిక స్థితిని సాధించిందన్నారు.

బ్యాంకు గ్రాస్ ఎన్‌పీఏ 1.02 శాతంగా, నెట్ ఎన్‌పీఏ సున్నా శాతంగా ఉందని తెలిపారు. 71.87 శాతం ప్రాధాన్యతా రంగ రుణాలను అందించామని చెప్పారు. 2000 సంవత్సరంలో కేవలం ఐదుగురు ఉద్యోగులతో ప్రారంభమైన బ్యాంకు ప్రస్తుతం 737 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు.

ఖాతాదారుల సౌకర్యార్థం ఏఈపీఎస్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, టోల్‌ఫ్రీ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ తదితర సేవలను అందిస్తున్నామని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 132 ఆన్‌సైట్ ఏటీఎంల ద్వారా రూ.1,531.44 కోట్ల లావాదేవీలు, 670.37 లక్షల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయని వెల్లడించారు.

607 కుటుంబాలకు బీమా పరిహారం

సామాజిక బాధ్యతలో భాగంగా గాయత్రి నిర్భయ సేవింగ్స్ ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని సీఈఓ వనమాల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 607 మంది ఖాతాదారుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని అందించి అండగా నిలిచామని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు మరణించిన ఖాతాదారులు దుంపాల రాజ్‌కుమార్, దేవి చంద్రయ్య, మేకల రవి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.

కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షుడు ఎస్. రవికుమార్, డైరెక్టర్లు బి. మల్లేశం, జె. ప్రసాద్, ఆర్. సాంబమూర్తి, జక్కని రాజమూర్తి, డింగి కరుణశ్రీ, బాశెట్టి పద్మజ, వానాల శ్రీనివాస్, ఆర్. సతీష్, బి. విజయ్, గెత్తి దయాకర్, ఎస్. సూర్యప్రకాష్ తదితరులు, సభ్యులు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

ఇదిని.