boduppal-bhoo-poratam-kalvakuntla-kavitha-arrest-bollaram-police-station Focus Keywords - Praja Mantalu

బోడుప్పల్ భూ పోరాటం: కల్వకుంట్ల కవిత అరెస్ట్
హైదరాబాద్, జూలై 2 (ప్రజా మంటలు):

బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలాల హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భూ పోరాట ప్రాంతానికి చేరుకున్న కవిత అక్కడి ప్రాంతాన్ని **"తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీ"**గా ప్రకటించి, బొడ్రాయి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కవితకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

అనంతరం కవితను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె అరెస్టును నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీస్ స్టేషన్‌లో కవిత మాట్లాడుతూ, ఉప్పల్‌లో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల స్థలాల హామీని అమలు చేయాలని మాత్రమే డిమాండ్ చేశామని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.