వ్యవసాయ పథకాలు - Praja Mantalu

తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.
ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.7 వేల కోట్ల రైతు భరోసా బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు.
రైతు భరోసా వార్షిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకుపైగా జమ చేశామని, తాజా విడతతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
అలాగే పంట బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, పంట బీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత రెండున్నరేళ్లలో వరి కొనుగోళ్ల కోసం రూ.80 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు తెలిపారు.
ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల భారం మధ్య ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందని, ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీకే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుతం 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.