తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్లు - Praja Mantalu

2 లక్షల ఉద్యోగాలు, 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కల్వకుంట్ల కవిత ధర్నా, డిమాండ్
హైదరాబాద్, జూన్ 29 (ప్రజా మంటలు):

ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగుల వెన్నంటి ఉంటానని ఆమె ప్రకటించారు.
ధర్నాలో మాట్లాడుతూ, నిరుద్యోగులతో విభేదించిన ఏ ప్రభుత్వం కూడా నిలదొక్కుకోలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 11 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందని విమర్శించారు.
కానిస్టేబుల్ పోస్టుల విషయంలో ప్రభుత్వం గతంలో 19 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని ప్రకటించి, ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. కనీసం 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరారు. గతంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి, ఇప్పుడు కొత్త జీవో ద్వారా దానిని తొలగించడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత పోలీసు నియామకాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో తాను కూడా పాత్ర పోషించానని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న మహిళల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా ఆమె విమర్శలు చేశారు. ప్రజలు ఉద్యోగాలు కోరుతుంటే వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపట్టడం కంటే ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పేదల ఇళ్లను తొలగిస్తూ ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
జులై 2న నిరుద్యోగులు చేపట్టనున్న సచివాలయం ముట్టడి కార్యక్రమానికి అవసరమైతే తమ ఉద్యమకారులు కూడా మద్దతు ఇస్తారని తెలిపారు. నిరుద్యోగులు ఒంటరివారు కాదని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
చివరగా, ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.