మోదీ - Praja Mantalu

నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):

జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.

ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.

1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో కొనసాగారని చెప్పారు.

ఈ లెక్కన 1946 నుంచి 1964 వరకు నెహ్రూ దాదాపు 18 సంవత్సరాలపాటు దేశ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల నెహ్రూ కంటే మోడీ ఎక్కువకాలం ప్రధానిగా ఉన్నారని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు.

బీజేపీ నాయకులు దేశ చరిత్రను సరిగా అధ్యయనం చేసి మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను మానుకోవాలని ఆయన సూచించారు.

స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు జైలు శిక్షలు అనుభవించారని, తమ ఆస్తులను త్యాగం చేశారని పేర్కొన్న చిన్నారెడ్డి, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీకి పూర్వగామిగా భావించే రాజకీయ శక్తుల పాత్ర లేదని విమర్శించారు.

నెహ్రూ పాలనా కాలానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య చరిత్రకు హానికరమని ఆయన అన్నారు.