భూకబ్జాలు - Praja Mantalu

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో మహాకూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇతర పార్టీలకు దగ్గరైన వ్యక్తి కవితపై విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని విమర్శించారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించారు. గండి మైసమ్మ వద్ద నిర్మించిన అమరుల స్థూపాన్ని ఇప్పటికీ ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
కుత్బుల్లాపూర్ ప్రాంతంలో విలువైన భూముల ఆక్రమణపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. కొంపల్లి, సుచిత్ర, బాచుపల్లి, జీడిమెట్ల, పావురం పేట ప్రాంతాల్లో కోట్లాది రూపాయల భూములు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని అన్నారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన నాయకులు ప్రజల్లో కనిపించడం లేదని విమర్శించారు. వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు, వికారాబాద్‌లో అసైన్డ్ భూముల ఆక్రమణ వంటి ఘటనలపై బీఆర్ఎస్ స్పందించలేదని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సోషల్ మీడియా, ఫోటోలకు మాత్రమే పరిమితమవుతున్నారని విమర్శించారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
టీఆర్ఎస్ నాయకులు ప్రజా ఉద్యమాలతో ముందుకు సాగుతున్నామని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ధిక్కార స్వరాలమవుతామని స్పష్టం చేశారు. కాళోజీ, దాశరథి, సమ్మక్క-సారలమ్మ, రాణి రుద్రమ్మల స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో మరో రాష్ట్ర నాయకుడు ఎత్తరి మారయ్య మాట్లాడుతూ, కవిత గారిపై విమర్శలు చేసే స్థాయి కేపీ వివేకానందకు లేదని అన్నారు. కవితపై విమర్శలు చేసిన నాటి నుంచే ఆయన రాజకీయ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.
కుత్బుల్లాపూర్‌లో ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వకుండా కుటుంబ సభ్యులు, అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. గత ఎన్నికల్లో టికెట్ విషయంలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావిస్తూ, తమ సహకారంతోనే ఆయన గెలిచారని పేర్కొన్నారు.
కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. ఇకపై కవితపై విమర్శలు చేస్తే తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.