సాన యాదిరెడ్డి - Praja Mantalu

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):

జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
రఘురాం జగిత్యాలకు చెందిన బండి రాధాకృష్ణ, విజయ దంపతుల రెండో కుమారుడు. ఆయన తండ్రి రాధాకృష్ణ జగిత్యాలలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా సేవలందించి, మూడేళ్ల క్రితం మరణించారు.
డిగ్రీ వరకు జగిత్యాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన రఘురాం, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఇంగ్లీష్‌లో ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేసి కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం జర్నలిజం, సినీ రంగాలపై ఉన్న ఆసక్తితో జర్నలిస్టుగా, రచయితగా, సినీ విశ్లేషకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు.
ఈటీవీ, వి6, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసిన ఆయన, తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి ప్రముఖ దర్శకుడు సానా యాది రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2004లో వచ్చిన ‘వరం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఉన్నత విద్యావంతుడిగా, సృజనాత్మక వ్యక్తిగా గుర్తింపు పొందిన రఘురాం 56 ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అత్యంత విషాదకరం. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రఘురాం మృతికి జగిత్యాల ప్రాంతానికి చెందిన పలువురు సాహితీ, సినీ, మీడియా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.