సహకార సంఘాలు - Praja Mantalu

సహకార సంఘాలపై నామినేటెడ్ విధానం వెనక్కి తీసుకోవాలి: పిఎసిఎస్ మాజీ అధ్యక్షుల డిమాండ్
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):

తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (DCCB)లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ విధానం తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని పిఎసిఎస్ తాజా మాజీ అధ్యక్షులు తీవ్రంగా విమర్శించారు.

జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పోతారం పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు ఆయిల్ నేని సాగర్ రావు, జై చిరంజీవ పత్తి రెడ్డి మహిపాల్ రెడ్డి, రాజా సుమన్ రావు, వెంకట మాధవ్, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకపోవడంతోనే ప్రభుత్వం అడ్డదారిలో నామినేటెడ్ విధానాన్ని అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

సహకార సంఘాలు రైతుల ఆధారంగా నడిచే వ్యవస్థలు కావడంతో, సభ్యులే ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిందిగా వారు స్పష్టం చేశారు. నామినేటెడ్ కమిటీల ద్వారా సభ్యులను ఎంపిక చేయడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం వసూళ్లు, సెటిల్‌మెంట్‌లపై మాత్రమే దృష్టి సారించి సహకార రంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నదని విమర్శించారు. జిల్లాలో ఉన్న 52 సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రైతులే సహకార వ్యవస్థకు వెన్నుముక అని, రాజకీయ జోక్యం పెరిగితే ఈ వ్యవస్థ నిర్వీర్యమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నామినేటెడ్ విధానాన్ని అమలు చేస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇలాంటి చర్యలు కొనసాగితే భవిష్యత్తులో ఇతర సంస్థలపైనా అదే విధానం అమలు చేసే అవకాశముందని హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటంతో పాటు రైతులను సమీకరించి ప్రజాక్షేత్రంలో ఉద్యమం చేపడతామని వారు స్పష్టం చేశారు.