ధర్మ సమాజ్ పార్టీ - Praja Mantalu

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్
వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు):

పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ నేత విశారదన్ మహరాజ్‌తో కలిసి రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పోలీసులుతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కవితను పోలీసులు అరెస్ట్ చేసి బంటారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పరిశ్రమల పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూములను లాక్కుంటున్నారని కవిత విమర్శించారు. కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం గ్రామాల్లో రైతుల భూములు స్వాధీనం చేసుకుంటున్నారని, దాదాపు 1200 ఎకరాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో ఎక్కువ భాగం అసైన్డ్ భూములేనని, మిగతా భూములు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులవేనని తెలిపారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, కొందరికి మద్దతు ధర లేదని, మరికొందరికి రుణమాఫీ జరగలేదని, ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని అన్నారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు కూడా దక్కడం లేదని ఆరోపించారు.
రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కవిత, స్వయంగా గ్రామాలకు వెళ్లి రైతుల బాధలు తెలుసుకోవాలని కోరారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
ధర్నా సమయంలో జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. కెమెరాలు లాక్కొని నెట్టేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
భూసేకరణను నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు.