Vemulawada crime news Journalist extortion case India CI Veera Prasad warning Telangana police arrest news - Praja Mantalu

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):

విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని స్థానిక సూపర్ మార్కెట్ యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడు. అధికారులతో తనిఖీలు చేయిస్తానని, పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అంతేకాకుండా కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుండి ఫోన్ పే ద్వారా రూ. 42,000 వసూలు చేశాడు. అనంతరం మరింత డబ్బుల కోసం వేధింపులకు దిగడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రామ్మోహన్, కానిస్టేబుల్ గోపాల్ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని, కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఈ సందర్భంగా సీఐ వీర ప్రసాద్ మాట్లాడుతూ, మీడియా లేదా అధికారుల పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
అలాగే నిందితుడు మహేష్ చేతిలో మరెవరైనా మోసపోయి ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.