Revanth Reddy criticism • Jeevan Reddy BRS join • Telangana politics news • Farmer schemes Telangana - Praja Mantalu

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం, రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):

కే.టి. రామారావు (కేటీఆర్) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా వైఫల్యాలతోనే ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదని ఆరోపించారు.

గురువారం జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్‌కు జిల్లా కేంద్రం శివారులోని దరూర్ కెనాల్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందిస్తూ, శాలువాలతో సన్మానించారు.

తరువాత కేటీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, త్వరలోనే మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను కలిసి పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తానని తెలిపారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మూడు సార్లు సుమారు 70 లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.27 వేల కోట్లను నిలిపివేసిందని విమర్శించారు. మరోవైపు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.

బాసర పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు.

అలాగే, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రైతులు, సామాన్య ప్రజలను సీఎం అవమానపరుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అధికార మత్తులో, అహంకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదని, అధికారం ఎవరి సొత్తు కాదని, గతంలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినట్లే ఇప్పుడు కాంగ్రెస్‌కు ఇచ్చారని, భవిష్యత్తులో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరితే పార్టీ మరింత బలపడుతుందని కేటీఆర్ తెలిపారు. రైతులు, పేదలు, యువత, మహిళల జీవితాల్లో ఆనందం రావాలంటే మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, గంగుల కమలాకర్, బాలకిషన్, రవిశంకర్, మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, సతీష్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.