kerala election - Praja Mantalu

అవినీతి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది - కేరళ ప్రజలకు కవిత విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని సూచిస్తూ, పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమికి మద్దతు తెలపాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన వీడియోలో “జై తెలంగాణ, జై కేరళ” అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. “తెలంగాణ కూతురిగా కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ, ఇచ్చిన హామీలు అమలు చేశామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

త్వరలో తాను ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించనున్నట్లు కవిత ఈ సందర్భంగా వెల్లడించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించినప్పటికీ, కేవలం సగం గ్యారెంటీగా ‘ఉచిత బస్సు ప్రయాణం’ మాత్రమే అమలు చేసినట్లు విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, యువతకు ఉద్యోగాలు, రైతులకు బోనస్, పెన్షన్ పెంపు వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ, రాష్ట్రాన్ని పార్టీకి ఏటీఎంలా మార్చేశారని విమర్శించారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతో కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు కొనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.