Labour Issues - Praja Mantalu

సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం - తెలంగాణ జాగృతి హెచ్చరిక
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):

హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి, hms కార్మిక సంఘం ఇతర స.మతాలతో కలిసి, నిర్వహించిన “సేవ్ సింగరేణి” రౌండ్ టేబుల్ సమావేశంలో సింగరేణి సంస్థపై ప్రభుత్వ వైఖరిని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. కార్మికుల నియామకాలపై విచారణ పేరుతో ఒత్తిడి చేయడం కంటే, ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇందులో hms కార్యదర్శి రియాజ్, ధర్మసమాజ్ పార్టీ  ప్రతినిధి ప్రసాద్ తో పాటు, సింగరేణి లోని 11 సంఘాలు పాల్గొన్నాయి.

సింగరేణి సంస్థకు ప్రభుత్వం రూ.47 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదల చేయకపోవడం వల్ల సంస్థ నిర్వహణ, కార్మికుల భద్రత, జీతాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కార్మికుల కష్టంతో నడుస్తున్న సంస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

డిపెండెంట్ ఉద్యోగాలు గత ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇచ్చినవని, వాటిపై విచారణ అనడం అనవసరమని అన్నారు. కార్మికులపై కాకుండా ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ కుంభకోణాలు, అధికారుల అవినీతి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

సోలార్, లిథియం ఒప్పందాలపై ఆరోపణలు
రాజస్థాన్‌తో జరిగిన సోలార్ ఒప్పందం, అలాగే “అల్ట్ మిన్” అనే చిన్న సంస్థతో రూ.2250 కోట్ల లిథియం రిఫైనరీ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం ఉన్న సంస్థతో భారీ ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక అవినీతి ఉందని ఆరోపించారు. ఈ ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలు
సింగరేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని, వారికి లాభాల్లో వాటా ఇవ్వడంపై ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ, 350 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

కాగ్ నివేదిక ప్రస్తావన
డీజిల్ కుంభకోణం, లీకేజీలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా వందల కోట్లు నష్టం జరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొన్నదని చెప్పారు. ఈ అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో 5 కీలక తీర్మానాలు:
కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయకూడదని నిర్ణయం
మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేసి పెండింగ్ కేసులు పరిష్కరించాలి
అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలి
“అల్ట్ మిన్” ఒప్పందంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కొత్త బొగ్గు గనులను సింగరేణి సంస్థతోనే నిర్వహించాలి

సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం

సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు. త్వరలో కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తామని తెలిపారు.