మావోయిస్టుల పునరావాసం - Praja Mantalu

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):

హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మెరుగైన ఆర్థిక ప్యాకేజీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కేసుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 130 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడం అరుదైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు.
అప్పగించిన ఆయుధాల్లో ఒక ఐఎన్‌ఎస్‌ఏఎస్ ఎల్ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21 ఐఎన్‌ఎస్‌ఏఎస్ రైఫిళ్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, 18 మూడు వందల మూడు రైఫిళ్లు, 33 ఇతర తుపాకులు ఉన్నాయి.

తెలంగాణలో 2024 జనవరి నుంచి ఇప్పటివరకు 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.
లొంగిపోయిన వారికి ప్రభుత్వం నివాస వసతి, వైద్య సేవలు, ఆర్థిక సహాయం అందిస్తుందని వెల్లడించారు.