శ్రేయాన్వి ర్యాంక్ - Praja Mantalu

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించిన మానస స్కూల్ విద్యార్థిని శ్రేయాన్వి
జగిత్యాల, మార్చ్ 07 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లాలో విద్యా రంగంలో మరో విశిష్ట విజయాన్ని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించింది. అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష – 2026లో పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. శ్రేయాన్వి రాష్ట్ర స్థాయిలో 23వ ర్యాంక్ సాధించి పాఠశాలకు గౌరవాన్ని తీసుకొచ్చింది.

ఈ విజయాన్ని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ విద్యార్థిని ఆర్. శ్రేయాన్విని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటుకోవడం గొప్ప విషయమని, ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.

పాఠశాలలో అందిస్తున్న క్రమశిక్షణతో కూడిన విద్య, నాణ్యమైన బోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ వల్లే విద్యార్థులు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని విజయాలు సాధించి జగిత్యాల జిల్లా విద్యా రంగానికి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రజిత రావు విద్యార్థిని శ్రేయాన్విని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల్లో ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సమగ్ర విద్యను అందిస్తూ ముందుకు సాగుతోందని పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, హరిచరణ్ రావు, మౌనిక రావు పేర్కొన్నారు.