తిరుమల యాత్ర - Praja Mantalu

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆరోపించిన ఆమె, ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే పార్టీగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి మాట్లాడుతూ, తాను చేయని తప్పుకు నాలుగేళ్లుగా తనపై మరియు తన కుటుంబంపై తీవ్ర మానసిక వేదన కలిగించారని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతో కోర్టు ఆ కేసును కొట్టివేసిందని చెప్పారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తమ కుటుంబానికి ఒక మొక్కు అని, త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన కవిత, వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. టీటీడీ వ్యవహారంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు చేశారు. పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అయినా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేసే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం కవిత శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.