మూసీ నది పరిరక్షణ - Praja Mantalu

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):

హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా అధికారులు మూసీ నదిలో నిర్మాణం జరుగుతున్న భారీ భవనాలను ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. మూసీ నదిలోనే అంతస్తుల భవనాలు కడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

కుత్భుల్లాపూర్‌లో పేదల ఇళ్లను కూల్చివేసినట్లు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు అక్రమంగా తొలగించారని పేర్కొన్నారు. మూసీ పరిధిలో కూడా పేదల ఇళ్లను కూల్చివేసినా, ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ బిల్డింగ్‌పై మాత్రం అధికారులు స్పందించడం లేదన్నారు.
హైడ్రా అధికారి రంగనాథ్‌కు ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ల సమావేశంలో ఉన్నానని సమాధానం ఇచ్చారని తెలిపారు. బుల్డోజర్లు తెచ్చే వరకు తాము అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు.

జనం బాట కార్యక్రమంలో భాగంగా చెరువులు, నదులు ఆక్రమించి కట్టిన భవనాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో నగరంలోని మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసులను కూడా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్‌లను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలు నిర్మాణాలను నిలిపివేసి, తరువాత మళ్లీ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే తమ పోరాటమని స్పష్టం చేశారు.మూసీ నది, తెలంగాణ వనరులను పరిరక్షించుకునే దిశగా తమ ఉద్యమం కొనసాగుతుందని కవిత తెలిపారు.