విలువల రాజకీయం దుద్దిళ్ల శ్రీపాద రావు విలువల రాజకీయం నేటి తరానికి స్ఫూర్తి - Praja Mantalu

దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి: స్పీకర్ వ్యవస్థకు వన్నె తెచ్చిన విలువల శిఖరం – యూటీ ఖాదర్ ఫరీద్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో ఘన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ U. T. ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యూటీ ఖాదర్ మాట్లాడుతూ, “స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద రావు. రాజకీయాల్లో పదవి అనేది కిరీటం కాదు, అది బాధ్యత” అని పేర్కొన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ హోదా వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని అన్నారు.

ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని విశ్వసించిన నాయకుడు శ్రీపాదరావు అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి సరిగా పనిచేయకపోతే రీకాల్ విధానం ఉండాలని సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ పార్లమెంటరీ విలువలను కాపాడారన్నారు.

అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవే శ్వాసగా రాజకీయాలు చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. సామాజిక ఉద్రిక్తతల సమయంలో రాజ్యాంగ పరిమితుల్లో ఉండి అమాయకులను రక్షించేందుకు ధైర్యంగా నిలిచారని గుర్తు చేశారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మాట్లాడుతూ, “ప్రజా క్షేత్రంలో సాటి మనిషి కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా నిలవాలో మా నాన్న మాకు వారసత్వంగా ఇచ్చారు. తనను నమ్ముకున్న కార్యకర్త ఇంటికి వెళ్తూ ప్రజల మధ్యే అమరుడయ్యారు” అని భావోద్వేగంగా తెలిపారు. తండ్రి ఆశయ సాధనకు కట్టుబడి ప్రజా సేవలో ముందుకు సాగుతానన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీపాదరావు నెలకొల్పిన పార్లమెంటరీ ప్రమాణాలు నేటి రాజకీయ పరిస్థితుల్లో మరింత ఆచరణీయమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.