Gulf crisis news Telugu - Praja Mantalu

మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు):

అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
గల్ఫ్ దేశాల్లోని భారతీయులు రోడ్డు మార్గం ద్వారా మస్కట్ చేరుకుని, అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు రావచ్చని తెలిపారు. ఈ మేరకు ఒమన్లోని భారతీయ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసినట్లు చెప్పారు.

రోడ్డు ప్రయాణ వివరాలు
దుబాయి నుంచి మస్కట్ వరకు సుమారు 450 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఇతర గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి మస్కట్ చేరాలంటే దాదాపు 900–1000 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

వీసా నిబంధనలు – కీలక సూచనలు
ఒమన్‌లోకి ప్రవేశించడానికి ముందుగా విజిట్ / టూరిస్ట్ వీసా పొందడం తప్పనిసరి.
వీసా కోసం Royal Oman Police అధికారిక వెబ్‌సైట్‌లో అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ-వీసాకు దరఖాస్తు చేయాలి.

ఆన్-అరైవల్ వీసా సౌకర్యం:

అమెరికా, యూకే, కెనడా, జపాన్ లేదా షెంగెన్ దేశాల చెల్లుబాటు అయ్యే వీసా లేదా రెసిడెన్సీ ఉన్న భారత పాస్‌పోర్ట్ హోల్డర్లకు 14 రోజుల వరకు ఆన్-అరైవల్ వీసా లభిస్తుంది.
వీరికి రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య బీమా తప్పనిసరి.
అలాగే Gulf Cooperation Council దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్‌లలో చెల్లుబాటు అయ్యే రెసిడెంట్ కార్డు కలిగిన భారతీయులకు కూడా ఆన్-అరైవల్ వీసా అందుబాటులో ఉంటుంది.

వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల చెల్లుబాటు కలిగి ఉండాలి.
ప్రయాణానికి ముందు తాజా నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.

సహాయం కోసం

భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రవాస భారతీయులు ఏవైనా సందేహాలు లేదా అత్యవసర సమాచారం కోసం మస్కట్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని నేరుగా సంప్రదించాలని మంత్రి బండి సంజయ్ సూచించారు.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రవాస భారతీయుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.