దూకుడు - Praja Mantalu

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.
కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు ఎమ్మెల్సీ సీ. అంజిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరిపై కీలక చర్చ జరిగింది.

వ్యవసాయ సంక్షోభంపై తీవ్ర ఆగ్రహం
సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభంపై చర్చ జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని బీజేపీ శాసనసభా పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది.
పంటల కొనుగోలు, కనీస మద్దతు ధర, సాగు ఖర్చుల పెరుగుదల, రుణభారం వంటి అంశాలను అసెంబ్లీలో గట్టిగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని నేతలు స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలు ఆగకపోవడం, పంట బీమా, సబ్సిడీల అమలులో గందరగోళంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై నిరసన
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని ఖండించారు.
ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో ప్రధానంగా లేవనెత్తాలని నిర్ణయించారు.

మార్చి 7 నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటన
బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించిన మేరకు, మార్చి 7 నుంచి శాసనసభా పక్షం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభమవుతుంది. ఈ పర్యటన ఆదిలాబాద్ నుంచి ప్రారంభమై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొనసాగనుంది.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాభిప్రాయాన్ని సేకరించి, తుది వ్యూహాన్ని ఖరారు చేస్తామని వెల్లడించారు.

అసెంబ్లీలో దూకుడు రాజకీయాలకు సంకేతం
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయం, నిరుద్యోగం, ఆర్థిక నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే దూకుడు వ్యూహంతో బీజేపీ ముందుకు సాగనుంది.
కామారెడ్డిలో జరిగిన ఈ సమావేశం ద్వారా బీజేపీ శాసనసభా పక్షం సమన్వయం మరింత బలపడినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈ వ్యూహం ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.