కర్ణాటక రాజకీయాలు బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ చంద్రూలమానీ లంచం కేసు లోకాయుక్తా దాడులు ధార్వాడ్ లోకాయుక్తా లక్ష్మీశ్వర మైనర్ ఇరిగేషన్ శాఖ లంచం ఆరోపణలు బాలాజీ ఆసుపత్రి సోదాలు ప్రజా మంటలు - Praja Mantalu

కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్
బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):

కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఆయనను శనివారం కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, క్లాస్–1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్ నుంచి ఎమ్మెల్యే డా. చంద్రూలమానీ మొత్తం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచంలో తొలి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో, లక్ష్మీశ్వర పట్టణంలో ధార్వాడ్ లోకాయుక్తా ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎమ్మెల్యేను పట్టుకున్నారు.

ఈ కేసులో ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. లంచం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు లోకాయుక్తా అధికారులు లక్ష్మీశ్వరలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన బాలాజీ ఆసుపత్రిలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటన కర్ణాటక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాప్రతినిధులపై లంచ ఆరోపణలు రావడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ కేసుపై లోకాయుక్తా అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.