జగిత్యాల జిల్లా వార్తలు - Praja Mantalu

మెట్‌పల్లిలో అదనపు కోర్టు కోసం హైకోర్టును కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు
మెటుపల్లి, ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):

మెట్‌పల్లిలో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హైకోర్టు న్యాయమూర్తి యారా రేణుక మరియు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్. గోవర్ధన్ రెడ్డి లను కలిశారు.
ప్రస్తుతం మెట్‌పల్లి కోర్టులో కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటి సత్వర పరిష్కారానికి అదనపు కోర్టు అత్యవసరమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జికి మరియు రిజిస్ట్రార్ జనరల్‌కు వినతిపత్రం అందజేసినట్టు ఆయన వెల్లడించారు.
అదనపు కోర్టుల ఏర్పాటు విషయమై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని, ఈ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హైకోర్టు అధికారులు హామీ ఇచ్చినట్టు మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది అల్లూరి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.

కందేనకుంట కుల బహిష్కరణ ప్రచారం అవాస్తవం – సామాజిక సమరసత వేదిక నివేదిక
జగిత్యాల, ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు):
బీరుపూర్ మండలం కందేనకుంట గ్రామంలో కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని సామాజిక సమరసత వేదిక (ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ) నిజ నిర్ధారణ కమిటీ స్పష్టం చేసింది. సంఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు వేదిక సభ్యులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.

సామాజిక సమరసత వేదిక రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆకుతోట వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘటనకు కారణమని ప్రచారం జరుగుతున్న సర్పంచ్ కొమిరె నర్సయ్య, మృతుడు ఏదుల రాజేశం కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులేనని తెలిపారు.

మృతుడి అంత్యక్రియల సమయంలో ఏర్పడిన స్వల్ప వాగ్వివాదాన్ని ఆసరాగా చేసుకుని కుల బహిష్కరణ జరిగిందన్న తప్పుడు ప్రచారం సాగిందని చెప్పారు. సర్పంచ్ గానీ, గ్రామ పెద్దలు గానీ మృతుడి కుటుంబాన్ని బహిష్కరించలేదని, పైగా కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం కూడా చేశారని వివరించారు.

గతంలో రిపోర్టర్‌గా పనిచేసి ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి ద్వారా విషయం వక్రీకరించబడి వీడియో వైరల్ అయ్యిందని తెలిపారు. అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించి విచారణ నిర్వహించారని, తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు పేర్కొన్నారు.

సున్నితమైన అంశాలను నిర్ధారణ లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల సమాజంలో విభజన వచ్చే ప్రమాదం ఉందని, మీడియా మరియు సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్, గౌరవ అధ్యక్షుడు కనికరం లచ్చన్న, రవితేజ, బీరెల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.