ఇందాపూర్ డెయిరీ టీటీడీ నెయ్యి వివాదం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డెయిరీ టీటీడీ టెండర్లు నెయ్యి స్కాం బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ ఆరోపణలు ప్రజా మంటలు - Praja Mantalu

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు
అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):

తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలను ప్రజల ముందుంచుతూ, నిజాలు బయటకు వచ్చాక ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

హెరిటేజ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 16, 2026 నాటికి ఇందాపూర్ డెయిరీని మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా చూపించారని, వివాదం బయటపడిన వెంటనే ఫిబ్రవరి 15, 2026 తేదీతోనే కో-మ్యాన్యుఫాక్చరింగ్ లొకేషన్‌గా మార్చారని జగన్ వెల్లడించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో హెరిటేజ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ హెడ్‌ను తొలగించిందని తెలిపారు.

2015లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారాల్లో ఇందాపూర్ డెయిరీని ప్రమేయం చేశారని, 2016 మార్చి 18న ఇందాపూర్ డెయిరీ నెయ్యి నాణ్యత లోపించిందని గుర్తు చేశారు. డిస్‌క్వాలిఫై అయిన మూడు నెలల్లోనే చంద్రబాబు ఇందాపూర్ డెయిరీకి మళ్లీ అర్హత కల్పించారని జగన్ ఆరోపించారు.

నవంబర్ 27, 2016న హెరిటేజ్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ద్వారా ఇందాపూర్ డెయిరీకి టీటీడీ నెయ్యి టెండర్ ఇచ్చారని, అప్పట్లో కేజీ నెయ్యి ధర రూ.321గా నిర్ణయించారని తెలిపారు. 2024లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే అదే ఇందాపూర్ డెయిరీకి మళ్లీ టెండర్ ఖరారై, కేజీ నెయ్యి ధర రూ.658కి పెరిగిందని విమర్శించారు.

టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కేంద్ర ల్యాబ్ పరీక్షల అనంతరం మాత్రమే సర్టిఫికెట్లు ఇస్తారని తెలిపారు. అలాగే బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, హర్ష్ డెయిరీకి చెందినదేనని ఆధారాలు ఉన్నాయని జగన్ అన్నారు. 2018 జూన్ 26న చంద్రబాబు హయాంలోనే బోలే బాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారని, 2019 మార్చి 6న 82 వేల కేజీల నెయ్యి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించారు.

బోలే బాబా సంస్థ తమది హెరిటేజ్‌తో కలిసి పనిచేస్తోందని ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఇండియా మార్ట్‌లో ప్రకటించిందని తెలిపారు. హెరిటేజ్ విజయవాడ, హెరిటేజ్ హైదరాబాద్ వేర్వేరు కాదని, హెరిటేజ్ రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఒకటే కాదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు చేసిన అక్రమాలపై సీబీఐ లేదా అంతకంటే ఉన్నత స్థాయి సంస్థలు విచారణ జరిపి జైలు శిక్ష విధించినా తప్పులేదని జగన్ వ్యాఖ్యానించారు. టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.