BRS BJP Congress - Praja Mantalu

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌కేనా?
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు ఓటర్లుగా లేరు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

రాయికల్ మున్సిపల్ పరిధిలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉండగా,

బీజేపీ – 5 స్థానాలు,

కాంగ్రెస్ – 3 స్థానాలు,

బీఆర్ఎస్ – 3 స్థానాలు,

స్వతంత్ర అభ్యర్థి – 1 స్థానం
గెలుచుకున్నారు. దీంతో ఎవరికి సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో, స్వతంత్ర కౌన్సిలర్ పాత్ర కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, స్వతంత్ర కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపి, వారిని శిబిరానికి తరలించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా, ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ కూడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని వ్యూహాలను ముమ్మరం చేసింది. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇప్పటికే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, రేపు జరగనున్న మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కట్కమ్ రవి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ ఉన్నత నాయకత్వం సూచనలతో ఆయనను అధికారిక అభ్యర్థిగా నిలబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

మున్సిపల్ కౌన్సిలర్ల మెజారిటీ మద్దతు రవికే ఉన్నట్లు వార్తలు రావడంతో, ఎన్నిక దాదాపు ఏకగ్రీవంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాయికల్ పట్టణ రాజకీయాల్లో ఈ పరిణామం పెద్ద చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే విజయోత్సవాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అధికారిక ప్రకటన వెలువడితే, రాయికల్ మున్సిపల్ పాలనలో బీఆర్ఎస్ కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రజలంతా రేపటి చైర్మన్ ఎన్నికల ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించారు.