Unannounced alliance - Praja Mantalu

ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):

మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని విమర్శించారు. మరోవైపు, ప్రజలు తమకు గుడులు కట్టారంటూ ప్రచారం చేసుకునే బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 మున్సిపాలిటీలకే పరిమితమైందని తెలిపారు.

ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప మిగతా చోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమలాంటి కొత్త తరహా రాజకీయ శక్తులను ప్రజలు ఆదరించారని చెప్పారు.

త్వరలోనే రాజకీయ పార్టీగా మారుతామని ప్రకటించినప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల్లో మొత్తం 40 మంది గెలిచారని, అధికారికంగా 33 స్థానాలు వచ్చినప్పటికీ బీ–ఫామ్ సమస్యల కారణంగా మరో ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులే గెలిచారని వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని, ప్రభుత్వ ఖర్చుతోనే ప్రచారం జరిగిందని కవిత ఆరోపించారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య నార్త్ తెలంగాణలో అప్రకటిత పొత్తు ఉందని, మున్సిపల్ ఎన్నికలు ఆ పొత్తుకు తొలి మెట్టు అని అన్నారు.

ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్‌లోనూ జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. వడ్డెపల్లి మున్సిపాలిటీని ఇరు పార్టీలూ కలిసే గెలుచుకున్నామని, దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు.

హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే తమ అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో సీపీఐ రాజకీయంగా పూర్తిగా బలహీనమైందని, భవిష్యత్‌లో కార్మికుల కోసం నిజంగా పోరాడే శక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పారు.

ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌వీఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.