#cripto - Praja Mantalu

కరీంనగర్‌లో విషాదం: క్రిప్టో కరెన్సీ మోసానికి బలైన ప్రభుత్వ వైద్యుడు ఆత్మహత్య
క్రిప్టో కరెన్సీ మోసాలు మరోసారి హెచ్చరికగా నిలుస్తున్నాయి

కరీంనగర్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):

కరీంనగర్ నగరంలో మరోసారి క్రిప్టో కరెన్సీ మోసం ప్రాణాలను బలి తీసుకుంది. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ఎంపీ. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు) వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని జీవితాన్ని ముగించుకున్నారు.

శ్రీనివాస్ స్వస్థలం మంకమ్మతోట కాగా, గతంలో చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందించారు. ఆయన భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

భార్య విప్లవశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, “స్నేహితులను నమ్మి క్రిప్టో కరెన్సీ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన భర్త తీవ్రమైన అప్పుల బారిన పడ్డాడు. తరచూ బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి వేధించడంతో మానసిక ఆందోళనకు గురయ్యాడు” అని పేర్కొన్నారు.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ తన స్నేహితులు కరుణాకర్, కిరణ్, గణేష్‌ల మాట నమ్మి “మెటా ఫండ్” పేరుతో పెట్టుబడులు పెట్టాడు. వారితో కలిసి పలు వ్యాపారాల్లో కోట్ల రూపాయలు పెట్టి చివరికి మోసపోయాడు. సుమారు రూ. 3 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోవడంతో, గత పది సంవత్సరాలుగా ఈఎంఐలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని బంధువులు తెలిపారు.

బ్యాంక్ రుణాల ఒత్తిడి, స్నేహితులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, మోసపోయిన భావనతో చివరికి ప్రాణాలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఆన్‌లైన్ పెట్టుబడుల్లో అప్రమత్తత అవసరమని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.