#KoppulaEshwar #LaxmanKumar #Dharmapuri #BRS #TelanganaPolitics #Jagityal #PrajaMantalu - Praja Mantalu

ధర్మపురిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి – మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్
జగిత్యాల, ఫిబ్రవరి 10 (ప్రజా మంటలు):

మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ధర్మపురిలో జరిగిన అభివృద్ధి కళ్లకు కనిపించకపోతే తాను ఏం చేయలేనన్నారు.

ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో ఒకటని, ముఖ్యంగా ధర్మపురి టెంపుల్ సిటీ అభివృద్ధి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెంపుల్ సిటీకి సంబంధించిన రూ.150 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 26 నెలలు పూర్తయినా ధర్మపురి పట్టణం గానీ, నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గానీ మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, రెవెన్యూ డివిజన్ అంటూ హామీలు ఇచ్చారని, ఇప్పటివరకు ఒక్క పనికీ శ్రీకారం చుట్టలేదన్నారు.

తమ హయాంలో రెండు గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల అభివృద్ధి, మాతా శిశు ఆసుపత్రిని 30 నుంచి 50 పడకలకు విస్తరించడం, డయాలసిస్ సెంటర్, రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. మురుగు నీరు గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఆరు గ్యారంటీలు, వ్యక్తిగత హామీలు అమలు చేయకుండా ఓటు అడిగే హక్కు లక్ష్మణ్ కుమార్‌కు ఉందా అని ప్రశ్నించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, సోషల్ వెల్ఫేర్ శాఖలో విద్యార్థుల పరిస్థితిపై మంత్రి బాధ్యత వహించాలని అన్నారు.

నీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ, ధర్మారం–మేడారం రిజర్వాయర్ నీటి పంపిణీపై జిల్లా స్థాయిలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. తన ఆస్తులపై వారం రోజుల్లో విచారణ చేయాలని కోరుతూ, 25 ఏళ్ల రాజకీయ జీవితంలో పారదర్శకంగా పనిచేశానని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.