మున్సిపాల్టీ - Praja Mantalu

ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

మున్సిపాలిటీలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేయాలని, రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తూ అవకతవకలకు తావు లేకుండా ఉండాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. జగిత్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుంచామని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టామని తెలిపారు. రాయికల్, జగిత్యాల పట్టణాల్లో బి.ఆర్.ఎస్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని, రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో ప్రజలు ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు.

ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలను విస్మరించాయని, నిబద్ధత కలిగిన గులాబీ సైనికులకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు. నిజాయితీ, నిబద్ధత ఉన్న వారికే పార్టీ సీట్లు కేటాయించిందని తెలిపారు.

జగిత్యాలలో గులాబీ జెండా హవా కొనసాగుతోందని, ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా వారు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని అన్నారు. అభివృద్ధిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు బి.ఆర్.ఎస్ పాలనలో జరిగిన పనులేనని, గత రెండేళ్లలో అక్కడక్కడా సీసీ రోడ్లు తప్ప పెద్దగా అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

ఈ ఎన్నికల్లో ‘ఎలక్షన్ మిరాకిల్’ జరగబోతుందని, ప్రజలు ప్రశ్నించే గొంతుకలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, మాతా శిశు కేంద్రం, చింతకుంట చెరువు అభివృద్ధి, 4520 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం బి.ఆర్.ఎస్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అప్పట్లో స్వయంగా కేటీఆర్ లబ్ధిదారులకు అందించారని తెలిపారు.

ఈ సమావేశంలో బి.ఆర్.ఎస్ నాయకులు దావ సురేష్, ఎల్. కార్తికేయ, అయిల్నేని వెంకటేశ్వర్ రావు, అల్లాల ఆనంద్ రావు, కొలుముల రమణ, శీలం ప్రవీణ్, ఆసీఫ్, అనంతుల గంగారెడ్డి, పడిగేల గంగారెడ్డి, ఎండబెట్ల ప్రసాద్, వొళ్ళాల గంగాధర్, వనమాల నిరంజన్, కుడిక్యాల సర్వేశ్వర్, అజ్ఘర్ ఖాన్, వసీం, గంగిపెల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.