Revanth Reddy Telangana CM Bhupalpally News Districts Rationalisation Singareni Medical Board - Praja Mantalu

జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
భూపాలపల్లి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారం, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ జిల్లాను తొలగించడమో, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమో ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు.

“ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న అపోహలను ఖండిస్తూ, జిల్లాల రేషనలైజేషన్ వంటి అంశాలు ఉంటే ప్రజలకు బహిరంగంగా తెలియజేసి, శాసనసభలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతమని, కుట్రలు, కుతంత్రాలను గుర్తించే శక్తి ప్రజలకు ఉందని పేర్కొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.

సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరివాహక ప్రాంతంలో వేలాది కార్మిక కుటుంబాలున్నాయని గుర్తుచేశారు. వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయన్న వార్తలు పూర్తిగా అసత్యమని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోదని తెలిపారు.

2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలపై కూడా ఆయన మాట్లాడారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాలను పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు నిర్మించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.

గతేడాది సరస్వతి పుష్కరాలు, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తూ, మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది హాజరయ్యారని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 6,116 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్రను గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సమ్మక్క–సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు 205 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.