బెల్లంపల్లి - Praja Mantalu

దళిత విద్యార్థినులకు పురుగుల అన్నం! ఆస్పత్రిలో 40 మంది విద్యార్థినులు
మంచిర్యాల ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వసతి గృహంలో భోజనం చేసిన సుమారు 40 మంది దళిత విద్యార్థినులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పులతో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హాస్టల్‌లో కలకలం రేగింది.

వివరాల్లోకి వెళ్తే…
హాస్టల్‌లో మధ్యాహ్న భోజనంగా అందించిన మిల్ మేకర్ కర్రీలో పురుగులు ఉండటం విద్యార్థినులు గమనించారు. అయినప్పటికీ భోజనం చేసిన కొద్ది గంటల్లోనే పలువురు విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో హాస్టల్ సిబ్బంది హడావుడిగా విద్యార్థినులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థినులకు చికిత్స కొనసాగుతోంది.

ఇది మొదటిసారి కాదు… మూడోసారి పునరావృతం!

అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే…
ఈ హాస్టల్‌లో ఇది మూడోసారి ఫుడ్ పాయిజనింగ్ ఘటన జరగడం. గతంలో కూడా నాణ్యతలేని ఆహారం, పరిశుభ్రత లోపాలపై విద్యార్థినులు, తల్లిదండ్రులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కిచెన్‌లో శుభ్రత లేకపోవడం, పాడైన సరుకులతో వంటలు చేయడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆవేదన

సంఘటన విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
“మా పిల్లలు చదువుకుంటారని నమ్మి హాస్టళ్లకు పంపిస్తే, పురుగుల అన్నం పెట్టి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది చదువా? లేక శిక్షనా?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరియైన వైద్యం కూడా అందట. లేదని ఆరోపిస్తున్నారు.

పేద, దళిత కుటుంబాల పిల్లలపైనే ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
వసతి గృహాల పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందని, కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం కనీసం పిల్లలకు తినే ఆహారం నాణ్యతను కూడా చూడలేకపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు.

వంటి చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పేదల పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడే ఈ వ్యవస్థపై ప్రభుత్వం ఎప్పుడు కళ్లు తెరుస్తుందో చూడాలి.