బ్యాక్ డోర్ నియామకాలు - Praja Mantalu

బ్యాక్‌డోర్‌లో బ్యాక్‌లాగ్ రిక్రూట్‌మెంట్?: కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 07 (ప్రజా మంటలు):

రాష్ట్రంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని పలువురు నిరుద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత తీవ్ర నిరాశలో ఉందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ వస్తుందన్న నమ్మకం యువతకు కలిగిందని, కానీ ఇప్పటివరకు ఏ నెలలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టత లేదని విమర్శించారు.

గతంలో బీఆర్ఎస్ హయాంలో పరీక్షలు లేకుండానే కొన్ని పోస్టులు భర్తీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని, నిర్మల్ సహా కొన్ని జిల్లాల్లో ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. యువత పోరాటంతో అప్పట్లో కొన్ని రిక్రూట్‌మెంట్లు నిలిచిపోయినా, కాంట్రాక్ట్ విధానంలో చేరిన వారికి న్యాయం జరగలేదన్నారు.

ఇప్పుడు మళ్లీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ వంటి పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్‌లాగ్ పోస్టులేనని, గతంలో రిక్రూట్ చేయని వాటినే ఇప్పుడు దొడ్డిదారిన భర్తీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల నుంచి యువత తమ ఆవేదనను వ్యక్తం చేస్తోందని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు పైరవీలతో పోస్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అధికారులకు కఠిన హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని ఉద్యోగాలు మెరిట్ ఉన్న అభ్యర్థులకే దక్కేలా చూడాలని కోరారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకునే ప్రయత్నాలు చేయవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.