yawar road - Praja Mantalu

యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.

2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్, కమ్యూనికేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. యావర్ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేశామని, జోన్ల మార్పుతో చట్టబద్ధ అనుమతులు లభిస్తున్నాయని చెప్పారు.

జగిత్యాల ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, భూమి కోల్పోయే వారికి TDR (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. 2023లో 100 అడుగుల రోడ్డుకు సంబంధించిన జీఓ, TDR అంశంపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు.

నిన్న గుమ్లాపూర్ సభలో యావర్ రోడ్డు విస్తరణతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియానికి స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా ఆరోపణలు చేయడం తగదని, ప్రభుత్వం తో కలిసి ప్రజలకు పనిచేసే కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.