#BCReservations #TelanganaPolitics #BRS #Congress #Kavitha #BCQuota #MunicipalElections #TelanganaJagriti - Praja Mantalu

బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా?
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.

బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా అనేక బీసీ సంఘాలు దీర్ఘకాలంగా పోరాటం చేశాయని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును సాధించామని, అయితే అదే సమయంలో మాధవ్ రెడ్డి సహా మరికొందరు దీనిపై కోర్టులో పిటిషన్ వేశారని గుర్తుచేశారు.

అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం వెనుక పార్టీ మొత్తం ఉన్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. బీసీలు రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్నా, వారి నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు.

హరీష్ రావుకు సన్నిహితుడు

మాధవ్ రెడ్డి హరీష్ రావుకు సన్నిహితుడని, ఆయన పర్సనల్ లాయర్ ద్వారానే ఈ కేసు వేయించారని ఆరోపించారు. మొదట ఇది వ్యక్తిగత చర్యగా భావించామని, కానీ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టమైందని కవిత వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ బీసీల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, పార్టీ స్థాయిలో సమీక్షా సమావేశాలు పెట్టకుండా కేవలం ఫోరమ్‌ల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. జనగణన అంశంలో కూడా బీఆర్ఎస్ ప్రజలను గందరగోళానికి గురిచేసిందన్నారు.

బి ఆర్ ఎస్ mla అరికెపూడి గాంధీ నిజామాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి?

కాంగ్రెస్ పార్టీపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికేపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించడం ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. స్పీకర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై నిజంగా నమ్మకం ఉంటే అరికేపూడి గాంధీని వెంటనే ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించాలని, స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

బీసీలకు ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ చెప్పినా, రెండు బడ్జెట్లలో కలిపి ఏడువేల కోట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్‌పై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న అధికారులను మాత్రమే టార్గెట్ చేసి, పెద్ద బాధ్యులను వదిలేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా పరిపక్వ రాజకీయాలు అవసరమని సూచించారు.

ఈ నెల 12న హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో మా గెలిపించండి

మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేస్తున్నామని, తమతో పాటు ప్రశ్నించే సీపీఎం, న్యూ డెమక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీలు వస్తాయి పోతాయి కానీ ప్రజల హక్కుల కోసం నిలబడే శక్తులే నిలిచిపోతాయని కవిత అన్నారు.