డీజీపీ - Praja Mantalu

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసి సుమారు 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, ప్రస్తుతం సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్నానని కవిత పేర్కొన్నారు. తనలాంటి ప్రజా జీవితంలో ఉన్న మహిళపైనే అత్యంత అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోతే, సామాన్య మహిళలకు రక్షణ ఎలా లభిస్తుందని ప్రశ్నించారు.

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునేందుకు చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పోలీసులు సమర్థంగా అమలు చేయడం లేదని ఆమె విమర్శించారు. ప్రజాప్రతినిధులు రూపొందించే చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఉందని, శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల వరకు తీసుకెళ్లి ప్రభుత్వ పరువు తీస్తానని హెచ్చరించారు.

మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు సంబంధించిన కోర్టు తీర్పులను డీజీపీకి పంపిస్తానని, వాటిని ఆయన అధ్యయనం చేయాలని కవిత అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ఉద్యమకారుల సమస్యలపై భూపోరాటాలు, ఆందోళనలు చేసినప్పుడు వారిపై లాఠీచార్జీలు చేయడం సరికాదన్నారు. ఉద్యమకారుల కుటుంబాలు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉద్యమకారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని, కనీసం కొంతమందికైనా గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.

ఉద్యమకారులకు బీమా సౌకర్యం, పెన్షన్ కల్పించడంతో పాటు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నిర్ణీత కాలవ్యవధితో కూడిన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

ఉద్యమకారుల సమస్యలపై కేకే కమిటీకి అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపినా, కమిటీ నివేదిక కూడా ముందుకు సాగలేదని ఆమె అన్నారు. తెలంగాణ జన సమితి తరఫున ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని, ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ఆ హామీల అమలుకు చొరవ చూపాలని కోరారు.

అసెంబ్లీలో కీలక అంశాలపై చర్చించాలి

ఫీజుల నియంత్రణ, ఉద్యమకారుల సమస్యలు వంటి అంశాలపై అసెంబ్లీలో చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కవిత కోరారు. అసెంబ్లీ చర్చించాల్సిన అనేక ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ డ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

ముఖ్యమంత్రి హేట్ స్పీచ్‌పై చట్టం తీసుకొస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌పై విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు వంద రోజుల కార్యాచరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ సమర్థంగా చర్చించడం లేదని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఆరోపించారు.

కేంద్రం చేపట్టే కులగణనలో కుల వివరాలను స్పష్టంగా నమోదు చేసేందుకు ప్రత్యేక కులం కాలమ్ ఉండాలని తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తున్నట్లు కవిత తెలిపారు.

మొత్తంగా మహిళల భద్రత, ఉద్యమకారులకు న్యాయం, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.

నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):

నాలుగు వారాల్లోగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది.

అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి యూపీఎస్సీకి అదనంగా నాలుగు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణ ఒక్కటే కాదని, ప్రకాష్ సింగ్ తీర్పును పాటించకుండా డీజీపీ నియామక ప్రతిపాదనలు పంపని రాష్ట్రాలు మరికొన్ని ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ డీజీపీ స్థానంలో యాక్టింగ్ లేదా అడ్హాక్ డీజీపీల నియామకాలు పెరగడంతో సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది.

రాష్ట్రాలు సమయానికి ప్రతిపాదనలు పంపేలా యూపీఎస్సీ లేఖ రాయవచ్చని, స్పందించని పక్షంలో ప్రకాష్ సింగ్ కేసులో దరఖాస్తు దాఖలు చేయాలని ఆదేశించింది. అవసరమైతే సంబంధిత రాష్ట్రాలపై బాధ్యత, జవాబుదారీతన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొంతవరకు సవరించింది.