మంత్రి - Praja Mantalu

వడ్ల కొనుగోళ్లలో రూ.107 కోట్ల అవినీతి: మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్
జగిత్యాల, జూన్ 10 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి ప్రతిస్పందిస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ తరచూ “రాజీనామా చేస్తా” అనే వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసిన కొప్పుల ఈశ్వర్, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పటికీ అనేక కొనుగోలు కేంద్రాల్లో సుమారు 20 శాతం వడ్లు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి వడ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

40 కిలోల బస్తాకు 3.3 నుంచి 3.4 కిలోల వరకు కటింగ్ చేసిన ఘటనలు జరిగాయని, ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లినా రైతులు ఈ విషయాన్ని చెబుతారని ఆయన అన్నారు. వడ్లు పోసిన తర్వాత నెలల తరబడి రైతులు కల్లాల వద్ద వేచి ఉండాల్సి వచ్చిందని, కాంటాలు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగిందని ఆరోపించారు.

గ్రేడ్ పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని, ప్రభుత్వం నిర్ణయించిన ఏ-గ్రేడ్ ధరకు బదులుగా బీ-గ్రేడ్‌గా చూపించి తక్కువ ధరకు కొనుగోలు చేశారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. హమాలీ చార్జీలు గతంలో బస్తాకు రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40 వరకు వసూలు చేశారని, లారీ రవాణా పేరిట అదనపు వసూళ్లు చేశారని పేర్కొన్నారు.

రైస్ మిల్లర్ల వద్ద తరుగు పేరిట ఒక లారీకి నాలుగు క్వింటాళ్ల వరకు కట్ చేశారని, ఇవన్నీ అవినీతి చర్యలేనని విమర్శించారు. రైతులు భయాందోళనల కారణంగా తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేవని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్‌కు 7 నుంచి 8 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధించారని, మొత్తం జిల్లాలో సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంపై ఈ కోతల ద్వారా రూ.107 కోట్ల మేర రైతుల నష్టం జరిగిందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.

చివరగా మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు సవాల్ విసురుతూ, “అవినీతి జరగలేదని చెబుతున్న మీరు ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. లేకుంటే రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):

ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని  ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము  అవకాశం ఇస్తే
హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప కి వెళ్తూ మహిళలు, చిన్నారులను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఫిబ్రవరి 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.

ఒకటవ వార్డులో అనూష సాగర్ ,రెండవ వార్డులో లత కృష్ణ స్వామి ,మూడవ వార్డులో కొండ రజిత , 12 వార్డులో కేశినేని రమేష్ ,13 వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్ ,14 వ వార్డులో దండి లక్ష్మీ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వారిని ఓటర్లకు పరిచయం చేస్తూ స్థానికంగా ఉండే నేతలు నిరంతరం మీ సమస్యలలో మీకు అండగా ఉంటారని, మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. పేదలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ,సన్న బియ్యం పంపిణీ , నూతన రేషన్ కార్డులు , మహిళలకు వడ్డీలేని రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 20 స్థానాలు ఇచ్చి తనకి మరింత ఆత్మస్థైర్యాన్ని  ఇవ్వాలని పేర్కొన్నారు.
హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందనీ,హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రియల్ కారీడార్ తీసుకొస్తున్నామన్నారు. మహిళలకు స్వీయ ఉపాధి పెంచుకోవడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఫిషరీస్ మార్కెట్,కోల్డ్ స్టోరేజ్ నిర్ణయిస్తామని ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా బలన్నివ్వాలని  ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
[02/02, 19:34] Rajanna Elkathurty Reporter: చట్టం ముందు కేసీఆర్ దేవుడా..?

భయం ఉంటేనే రాస్తారోకోలు ర్యాలీలు

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఎల్కతుర్తి ఫిబ్రవరి 02 ప్రజా మంటలు

సీట్ విచారణలో భాగంగా ఆదివారం రోజున అధికారులు విచారణకు పిలువగా తప్పు చేయనప్పుడు భయమెందుకు అని వారి అనుచరులు రాస్తారోకోలు బైకు ర్యాలీలు చేయడమేంటని అన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెసిఆర్ ఏమైనా దైవంశ సంభూతుడ మానవాతీతుడా మహాత్ముడా అని అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను చట్టాలకు అతీతుడా గా చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమాల్లు రంజిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సిబుసోరెన్ జయలలిత లాలు ప్రసాద్ యాదవ్ యడ్యూ రప్ప వంటి దేశంలోని ప్రముఖ నాయకులే తప్పులకు జైళ్లకు వెళ్లినప్పుడు దుర్మార్గపు పనులు చేసిన ముఠాకు నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. కెసిఆర్ తప్పు చేయలేదని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు బైక్ ర్యాలీలు పెట్టి ప్రజలను రోడ్డెక్కించడం ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అనంతరం కెసిఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని వేలకోట్ల అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని రంజిత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఆ అప్పుల భారం మోస్తూ ప్రజలకు పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రజలకు సంక్షేమ పథకాలు విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే అభివృద్ధిని జీర్ణించుకోలేని కెసిఆర్ ఆయన అనుచరులు ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ గ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ పై ఉన్న ఆర్థిక అక్రమాలు అవినీతి ఆరోపణలపై సిబిఐ ఈడి సహా కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు బయటపడితే కెసిఆర్ పాలనలో జరిగిన దోపిడీ ప్రజల ముందు బయటపడుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అన్నింటిని గమనిస్తోందని రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మరోసారి రాజకీయ బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. చట్టాన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా చివరికి న్యాయం గెలుస్తుందని కేసీఆర్ అయినా సరే చట్టం ముందు తలవంచక తప్పదని వీరమల్లు రంజీత్ రెడ్డి స్పష్టం చేశారు.