Rajasthan Animal Fair - Praja Mantalu

‘షాబాజ్’ గుర్రం విలువ ₹15 కోట్లు? ‘అన్మోల్’ అనే గేదె విలువ ₹23 కోట్లు, గుర్రాలు, గేదెల వేలం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది
పుష్కర్ పశుసంతలో కోట్లాది విలువైన పశువుల ప్రదర్శన – గుర్రాలు, గేదెల వేలం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది

అజ్మీర్ (రాజస్థాన్), అక్టోబర్ 28:

రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రముఖ పుష్కర్ పశుసంతలో (Pushkar Cattle Fair 2025) ఈ సంవత్సరం కోట్లాది రూపాయల విలువ గల పశువులు ప్రదర్శనకు వచ్చాయి. భారతదేశంలోనే అత్యంత పురాతన, విశాలమైన పశుసంతగా పేరుగాంచిన ఈ జాతర అక్టోబర్ 23న ప్రారంభమై నవంబర్ 7 వరకు కొనసాగనుంది. దేశం నలుమూలల నుంచి వ్యాపారులు, రైతులు, పశుసంరక్షకులు, పర్యాటకులు ఈ జాతరలో పాల్గొంటున్నారు.

తేదీలు: అక్టోబర్ 23 – నవంబర్ 7, 2025

ముఖ్య పశువులు:

షాబాజ్ (గుర్రం) – ₹15 కోట్లు

రాణా (గేదె) – ₹600 కిలోలు, ₹1,500 రోజువారీ ఆహార ఖర్చు

అన్మోల్ (గేదె) – ₹23 కోట్లు

బాదల్ (గుర్రం) – ₹11 కోట్లు

ఈ సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది చండీగఢ్‌కి చెందిన ‘షాబాజ్’ అనే గుర్రం. కేవలం రెండున్నర సంవత్సరాల వయస్సు ఉన్న ఈ గుర్రం విలువ రూ. 15 కోట్లుగా అంచనా వేయబడింది. రోజువారీ సంరక్షణ ఖర్చు సుమారు ₹2 లక్షలు, అని దాని యజమాని గ్యారీ గిల్ తెలిపారు. షాబాజ్‌ జాతి గుర్రాలు వేగం, ఆకృతి, ప్రదర్శనశైలిలో అత్యుత్తమమైనవిగా పేరుగాంచాయి.

అదే విధంగా ఉజ్జయినికి చెందిన ‘రాణా’ అనే గేదె కూడా ఈ సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 600 కిలోల బరువు, 8 అడుగుల పొడవు గల ఈ గేదె రోజువారీ ఆహారం ఖర్చు సుమారు ₹1,500. దాని ఆహారంలో పప్పులు, గుడ్లు, నెయ్యి, పాలు వంటి పోషక పదార్థాలు ఉంటాయి.

అత్యంత ఖరీదైన పశువుల జాబితాలో రాజస్థాన్‌కు చెందిన ‘అన్మోల్’ అనే గేదె విలువ ₹23 కోట్లు, దానిని యజమాని రాజకుటుంబ సభ్యుడిలా చూసుకుంటానని తెలిపారు. మరోవైపు, రూ. 11 కోట్ల విలువైన ‘బాదల్’ అనే గుర్రం కూడా ఈ జాతరలో ప్రదర్శనకు వచ్చింది. బాదల్ 285 ఫోల్స్‌కు తండ్రిగా పేరుపొందింది.

పుష్కర్ పశుసంత పర్యాటక ఆకర్షణగా మారి, విదేశీ సందర్శకులను కూడా విస్తారంగా ఆకట్టుకుంటోంది.