#suspended - Praja Mantalu

కురిక్యాల జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు కమల సస్పెన్షన్
— విద్యార్థుల భద్రత నిర్లక్ష్యం, వాస్తవాల దాచిపెట్టడంపై చర్య

కరీంనగర్, అక్టోబర్ 28:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనపై జిల్లా పరిపాలన కఠిన చర్యలు తీసుకుంది. ఆఫీస్ సబార్డినేట్ ఎం.డి. యాకూబ్ పాషా బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో వాస్తవాలను దాచిపెట్టినందుకు, నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ. కమలను విధులనుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వెంటనే కలెక్టర్ పమేలా సత్పతి ముగ్గురు సభ్యుల అధికారుల బృందాన్ని నియమించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. విచారణ బృందం నివేదికలో ప్రధానోపాధ్యాయురాలు కమల ఘటనను దాచిపెట్టాలని సిబ్బందిని బెదిరించిందని, విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఉన్నతాధికారులకు నిజాంశాలు తెలియజేయలేదని స్పష్టంగా పేర్కొంది.

దీంతో కలెక్టర్ పమేలా సత్పతి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీచేసి, కమలను విధుల నుండి తప్పించారు. అలాగే ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ప్రధానోపాధ్యాయురాలు కమల ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ను వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీస్ సబార్డినేట్ యాకూబ్ పాషా ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.