BS ramulu - Praja Mantalu

“తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..
హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):

తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్  బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు.

1992 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న దరకమే ఐక్య వేదిక కృషిని వ్యాసంలో పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. పాట, కథ, కవిత, నవల, సాహిత్య విమర్శ వంటి విభిన్న ప్రక్రియల్లో 220కు పైగా పుస్తకాలు వెలువడిన విషయాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.

“ప్రవహించే పాట” వంటి ప్రముఖ పాటల సంకలనాలు, మాస్టర్ జీ రచనలు, తెలంగాణ దళిత సాహిత్య ఉద్యమంలో పాటల పాత్ర గురించి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. “పాటలే ముందుగా ప్రజల్లోకి వెళ్లాయి. కానీ వ్యాసంలో వాటిని చివరన ప్రస్తావించడం సాహిత్య చరిత్ర అవగాహన లోపాన్ని సూచిస్తుంది” అని అన్నారు.
తెలంగాణ దళిత సాహిత్య వికాసంపై సరైన అవగాహన లేకుండా వ్యాసం రాయడం, దాన్ని తెలంగాణ సాహిత్య పత్రిక ప్రచురించడం “కొత్త రూపంలోని సీమాంధ్ర ఆధిపత్య ధోరణికి ఉదాహరణ” అని బి.ఎస్. రాములు వ్యాఖ్యానించారు.
తనపై గతంలో కోయి కోటేశ్వరరావు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాన్ని కూడా గుర్తు చేస్తూ, “తెలంగాణ సాహిత్య చరిత్రపై మీ అవగాహన ఎంత ఉందో ఈ వ్యాసం ద్వారా బయటపడింది” అని పేర్కొన్నారు.
అంతేకాక, “రెండో వ్యాసం రాయండి. ముందుగా నా ఇంటర్వ్యూ తీసుకోండి. ఆ తరువాత ఇతర రచయితలు, ఉద్యమకారులను కలుసుకుని వివరాలు సేకరించండి. అప్పుడే సమగ్ర చరిత్ర రాయగలుగుతారు” అని సూచించారు.

భండారు విజయ కథా సంపటాల పరిచయ సభ
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):

హైదరాబాద్ విమెన్ రైటర్స్ మరియు హస్మిత ప్రచురణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాలులో జనవరి 23 సాయంత్రం భండారు విజయ సంపాదకత్వంలో రూపొందిన ‘పరిష్కృత’ (కథా సంకలనం) మరియు ఆమె స్వీయ కథా సంపుటి ‘సహజాత’ పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వరంగల్ అరసం అధ్యక్షులు శ్రీ నిధి గారు వేదికపైకి ప్రముఖులను ఆహ్వానించి, భండారు విజయ స్త్రీవాద రచనలు, ఆమె సాహిత్య ప్రయాణం, రాబోయే రచనలపై పరిచయం చేశారు.

సభాధ్యక్షులు, తెలంగాణ బీసీ కమిషన్ తొలి కమిషనర్, శతాధిక రచయిత శ్రీ బి.ఎస్. రాములు  మాట్లాడుతూ—
భండారు విజయ కథలు రాయడమే కాకుండా, ఇతర రచయితలతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ ‘పరిష్కృత’ వంటి కథా సంకలనాలను తీసుకురావడం అభినందనీయమన్నారు. కథలు రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలను తాను మూడు దశాబ్దాల క్రితమే ‘కథల బడి’ పుస్తకంగా ప్రచురించానని, అది ప్రతి రచయిత చదవాల్సిన గ్రంథమని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న కవి ఏనుగు నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ—
స్త్రీవాదాన్ని భూమికగా చేసుకుని భండారు విజయ చేస్తున్న రచనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రత్యేకతను తెలియజేసే ‘జిగర్’ కవిత్వ సంకలనాన్ని అనిశెట్టి రజితతో కలిసి తీసుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, తన మిత్రురాలు కీ.శే. అనిశెట్టి రజితకు అంకితమిస్తూ ‘సహజాత’ను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ తరపున ఆమెకు అభినందనలు తెలిపారు.

‘సహజాత’ పుస్తక పరిచయం

ప్రముఖ సాహిత్య విమర్శకురాలు పి. జ్యోతి మాట్లాడుతూ—
‘సహజాత’లోని 21 కథలు వస్తుపరంగా విభిన్నంగా ఉండి, ప్రతి కథ కొత్త దృక్కోణాన్ని అందిస్తుందని తెలిపారు. సమస్యలను విక్టిమైజ్డ్ మోడ్‌లో చూపిస్తూ, పరిష్కారాలను సైకోథెరపీ, కౌన్సిలింగ్ పద్ధతుల్లో ఆలోచింపజేసేలా ఉన్నాయని చెప్పారు.
IVF ద్వారా సంతానం, సింగిల్ మహిళల మాతృత్వం, కులాంతర వివాహాలు, NRI పెళ్లిళ్ల వైఫల్యాలు వంటి అంశాలు కథల్లో బలంగా ప్రతిఫలించాయని అన్నారు. ‘అమ్మగది’, ‘దేవుడమ్మలు’ కథలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. యువత తప్పక చదవాల్సిన కథలుగా పేర్కొన్నారు.

దళిత రచయిత జూపాక సుభద్ర మాట్లాడుతూ—
ఈ కథలు ‘సర్వే జన సుఖినో భవంతు’ అన్న భావనతో ముగుస్తాయని, తెలంగాణ ఉద్యమం, ట్రాన్స్ కమ్యూనిటీ సమస్యలు, కుటుంబ వ్యవస్థలోని అంతర్గత సంఘర్షణలను సున్నితంగా చిత్రించాయని అన్నారు. ‘సీతామహాలక్ష్మి’, ‘దేవుడమ్మ’ కథలు తనకు బాగా నచ్చాయని చెప్పారు.

‘పరిష్కృత’ పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రముఖ రచయిత, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి—
మారుతున్న కాలాల్లో మహిళల సమస్యలు కొత్త రూపాలు దాల్చుతున్నాయని, గృహహింసపై ఈ సంకలనంలో 16 కథలు ఉండటం విశేషమన్నారు. ఈ కథలు పాఠకుల్లో సమస్యలపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు.

రచయిత కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ—
గృహహింస, లింగ వివక్ష, వరకట్నం, సంతాన సమస్యలు వంటి అంశాలు ఈ కథల్లో హృదయవిదారకంగా ఉన్నాయని, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు ఇవి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సత్కారం, ఇతర కార్యక్రమాలు

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ—
సాహిత్యం పరిష్కార దిశగా ఉన్నప్పుడే సమాజానికి ఉపయోగపడుతుందని అన్నారు. స్త్రీవాద దృక్పథంతో కథలు రాస్తూ, ఇతర రచయితలను ప్రోత్సహిస్తున్న భండారు విజయకు అకాడమీ తరపున అభినందనలు తెలిపారు. అనంతరం ఆమెను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ బస్ యాత్ర (ఫిబ్రవరి 1న ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రారంభమై ఫిబ్రవరి 3న అమరావతిలో ముగింపు) పోస్టర్‌ను ఆవిష్కరించారు.

చివరగా గిరిజ పైడిమర్రి గారి వందన సమర్పణతో లో కార్యక్రమం ముగిసింది.